యూనివర్సిటీ లో వీసీ తిన్న డబ్బుల్ని కక్కించి వర్సిటీ అభివృద్ధికి వాడాలి…

– పి.డి.ఎస్.యూ డిమాండ్
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత రెండేళ్లుగా తెలంగాణ యూనివర్సిటీలో వీసీ ప్రజాధనాన్ని కజేశాడాని, డబ్బుల్ని రికవరీ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి వాడాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యూనివర్సిటీ అధ్యక్షులు వి. సంతోష్ లు డిమాండ్ చేశారు.  ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి శనివారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈరోజు యూనివర్సిటీ వీసీ 50, వేల రూపాయల లంచం తీసుకుంటున్న సందర్భంలో ఏసీబీ అధికారులు పట్టుకోవడన్నీ స్వాగతిస్తున్నామని, యూనివర్సిటీలో అవినీతికి సహకరించిన వారందరి కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థి సంఘాలుగా పోరాటాలతో దిగివచ్చి రైడ్ చేసినటువంటి ఏసీబీ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని, బోధనను గాడిలో పెట్టాలని, యూనివర్సిటీలో అవినీతిని సహించబోమని తెల్చి చేప్పారు.

Spread the love