చంద్రు తండాలో ఘనంగా బోనాలు

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని చంద్రు తండా గ్రామంలో ఆదివారం మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు అందంగా బోనాలను అలంకరించుకొని నెత్తిన ఎత్తుకొని ఉమ్మడిగా వస్తు నృత్యాలు చేస్తూ దేవికి నైవేద్యం సమర్పించారు. కాలం చల్లగా పిల్లా పాపలు పశుపక్షాదులతో పాడిపంటలతో ప్రతి రైతు కుటుంబం ఆరోగ్యంగా చిరకాలం కళకళలాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మహిళలు తెలిపారు. బోనాల పండగ అంటేనే ఎంతో ప్రీతిపాత్రమైందని చంద్రు తండా మహిళలు తెలుపుతున్నారు. తెలంగాణ ప్రత్యేక పండుగ అయిన బోనాల పండుగను ఆనందోత్సాహాలతో నూతన వస్త్రాలతో డిజె సౌండ్ల మధ్య నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతామని అంటున్నారు. మహిళలే కాదు యువత కూడా ఆయా కార్యక్రమాల నిర్వహణలో మెయింటెనెన్స్ లో కలిసి చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తారు. వారెవా బోనాల పండుగ అంటే బోనాల పండుగ అని అంటున్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మస్తు ఎంజాయ్ చేస్తామని చెబుతున్నారు.
Spread the love