గుట్టను రెండు ముక్కలు చేసి అక్రమ మొరం దందా

– మరో కేజీఫ్ తలపిస్తున్న వైనం
– రాజకీయ నాయకుల అండదండలతోనే ఇన్ని రోజులు అక్రమ క్వారీ ఏర్పాటు
నవతెలంగాణ – మాక్లూర్
గత కొన్నేళ్లుగా మండలంలో అక్రమ మొరం దందా కొనసాగుతూనే ఉంది. ఎన్ని సార్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చిన, వినతి పత్రాలు అందజేసిన అక్రమ మొరం మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొత్త ఏర్పాటైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనాని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
మండలంలోని సింగం పల్లి గ్రామ శివారులోని 512 సర్వే నెంబర్ లో గత కొన్నేళ్లుగా కొంత భూమిని లిజ్ గా తీసుకొని కొంత మంది అక్రమ మొరన్ని జిల్లా కేంద్రంలోని వెంచర్లకు, నూతన గృహాలకు సుమారు రూ. 2500 వందన నుంచి రూ. 3 వేల వరకు అమ్మూకొని సొమ్ము చేసుకుంటున్నారు.
గుట్టను రెండుగా చీల్చి..
ఈ భూమిలో గల గుట్టను రెండుగా చీల్చి గుట్ట లోపల నుంచి మొరాన్ని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. గుట్ట మద్యలో దారి చేసి గుట్ట లోపల నుంచి మొరాన్ని తీసి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఇది కెజీఫ్ సినిమాల తలపిస్తుంది.
రాజకీయ నాయకుల అండదండలతో…
మొరం త్వకలను రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమీప బంధువు నరేందర్ రెడ్డి, చిన్నపూర్ సర్పంచ్ భర్త పుప్పాల గంగారెడ్డి మరి కొంత మంది కలిసి మొరన్ని తరలిస్తున్నారు. ఎవ్వరైనా టాస్క్ ఫోర్స్, మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించడానికి వస్తున్నారంటే ముందుగానే మొరం మాఫియాకు సంచారం అందేదని స్థానికులు అంటున్నారు. దీనితో మాఫియా జాగ్రత్త పడేదని తెలుపుతున్నారు. కొత్త ప్రభుత్వంలోని ప్రభుత్వ కజనను, పర్యావరణాన్ని కపుడుతరాని భావిస్తున్నారు.
Spread the love