ప్రకృతి

కృప్రకతి-పర్యావరణం-అభివద్ధి మధ్య అనుసంధానాన్ని సాధించడానికి బదులుగా ఒకదానికొకటి పోటీగా నిలబెట్టడంలో సంపన్నదేశాలు, ప్రత్యేకించి సామ్రాజ్యవాద దేశాలు దుర్మార్గంగా వ్యవహరించాయి. సముద్రాల, నదుల, పర్వతాల, అడవులు ఉనికికి ముప్పుగా పరిణమించే విధానాల్ని అనుసరించాయి. భూతాపం పెరగడానికి కారణమైన ఈ విధానాల పర్యవసానాలు రానున్న యాభయ్యేళ్ళలో భీతవహంగా రూపుదాల్చనున్నాయి. ఇవాళ కళ్ళముందు కనిపించే హిమాలయ మంచు పర్వతాలు కరుగుతున్నాయి. అర్ధశతాబ్దం తర్వాత వాటి రూపు చెదిరిపోయే ప్రమాదముంది.

పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ఇల్లు, పెరిగే మొక్కలు, తిరిగే జంతువులు వంటివన్ని కలిపి చుట్టూ ఉన్న పరిసరాల వ్యవస్థే పర్యావరణం. సమస్త జీవుల మనుగడకు మూలాధారం. ఇది జీవనిర్జీవ కారకాల సముదాయం. ప్రకతిని చూసే విధానం యుగయుగానికి మారవచ్చు కానీ ప్రకతి మారదంటారు ప్రసిద్ధ ప్రకతి తత్వవేత్త మసనోబు ఫుకుఓకా. కాలుష్య కాసారం ప్రకతినీ, పర్యావరణాన్నీ, మానవ ఆరోగ్యాన్నీ అనేక రూపాల్లో ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు అందంగా… అహ్లాదంగా….స్వచ్ఛంగా ఉన్న వాతావరణం క్రమంగా కనుమరగైపోతోంది. అవసరంలేని ఆధునికతతో, రకరకాల వ్యర్థాలతో, కాలుష్యాలతో జీవావరణ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే అది తీవ్రస్థాయికి చేరిందని పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ మనుగడ సాఫీగా ఉండాలంటే ప్రకతిని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
నిజంగా ప్రకతి మారడం లేదా అనే ప్రశ్న రావడం సహజం. ప్రకతి స్వభావంలో మార్పులేదు. కానీ అభివద్ధి పేరిట ప్రకతిని కొల్లగొట్టే విధానాలతో ప్రకతి సహజ గమనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణ సమస్య తలెత్తింది. మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధంగా సాగించే ప్రయాణం మానవ అస్తిత్వానికి పెనుసవాల్‌. శాస్త్రీయజ్ఞానం, అభివద్ధి పేరిట ప్రకతి గుండెల్లో చిచ్చు పెట్టే ధోరణి అవాంఛనీయం.
ప్రకతి-పర్యావరణం-అభివద్ధి మధ్య అనుసంధానాన్ని సాధించడానికి బదులుగా ఒకదానికొకటి పోటీగా నిలబెట్టడంలో సంపన్నదేశాలు, ప్రత్యేకించి సామ్రాజ్యవాద దేశాలు దుర్మార్గంగా వ్యవహరించాయి. సముద్రాల, నదుల, పర్వతాల, అడవులు ఉనికికి ముప్పుగా పరిణమించే విధానాల్ని అనుసరించాయి. భూతాపం పెరగడానికి కారణమైన ఈ విధానాల పర్యవసానాలు రానున్న యాభయ్యేళ్ళలో భీతవహంగా రూపుదాల్చనున్నాయి. ఇవాళ కళ్ళముందు కనిపించే హిమాలయ మంచు పర్వతాలు కరుగుతున్నాయి. అర్ధశతాబ్దం తర్వాత వాటి రూపు చెదిరిపోయే ప్రమాదముంది.
అడవుల్ని అంటి పెట్టుకుని శతాబ్దాలుగా జీవిస్తున్న ఆదివాసుల్ని తరిమిగొట్టే విధానాల్ని అనుసరిస్తూ అభివద్ధి కోసమేనని నమ్మబలికే పాలకుల తీరు మానవాళి భవిష్యత్తు మీద ప్రశ్నార్థకంగా నిలిచింది. కనుకనే ప్రకతికీ, మానవాళి పరిసరాలకీ క్షేమకరంగా ఉండే ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించడం ఇవాళ్టి అవసరం. వర్తమాన తరాలకే కాదు భవిష్యత్‌ తరాలకు ఉపకరించే విధానాలు ప్రకతి సమ్మతంగా ఉండాలి. పర్యావరణ హితాన్ని మన్నించాలి. స్థానికతనీ, స్థానిక జీవన సంస్కతుల్నీ పరిగణనలోకి తీసుకోడం ద్వారానే ఇది సాధ్యం.
ప్రకతి సమ్మతంగా ఉండటమంటే అభివద్ధికి వ్యతిరేకం కాదు. ప్రకతి సహజ వనరుల్ని దోచుకోడమే పురోగతి కాదు. ప్రకతి చల్లగా, సుభిక్షంగా లేకపోతే మానవాళి శాంతిగా ఉండలేదు. గత రెండు మూడు దశాబ్దాల విపత్తులు నగరాల ఉనికినే చెల్లాచెదరు చేశాయి. ప్రకతి ఒడిలో మనుషులు హాయిగా ఉండాలంటే ప్రకతిని అర్థం చేసుకోవాలి. ప్రకతిని జయించడం పేరిట విధ్వంసానికి పాల్పడటం తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే చందమవుతుంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణ హితాన్ని కోరే సాహిత్యం, సినిమా, కళలు వికసించి వర్థిల్లుతున్నాయి. స్థానికతనీ, స్థానిక జీవన విధానాలనీ గుర్తించి, గౌరవించే సంస్కారం ఉండాలని చెబుతున్నాయి. నల్లమల్ల అడవుల్లోంచి చెంచుల్ని ఇతర ఆదివాసీ సమూహాల్నీ తరిమేయాలనుకునే విధాననిర్ణేతలకి ఈ సంస్కారం, విజ్ఞత చేకూరాలని ఆశిద్దాం.

Spread the love