ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారాని ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 20వ తేదీన ఆయనతో పాటు పలువురు మంత్రులు సరిగ్గా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్‌ను ఓడించి.. బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా.. రాష్ట్రంలో మాత్రం అధికారం చేపట్టలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కాషాయ పార్టీకి ఆ లోటు తీరింది.

Spread the love