పెద్దకొడప్ గల్ మండలంలోని వివిధ గ్రామాలలో పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు అన్నవాయితీగా వస్తున్న ఈ పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు.అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను శనివారం ఘనంగా జరుపుకున్నారు. పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో ముస్తాబు చేసిన బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. హనుమాన్ దేవాలయాల్లో ఎడ్లతో ప్రదక్షిణలు చేయించి మొక్కులుచెల్లించుకున్నారు. బసవన్నలు ఏడాది పొడ వున పడిన కష్టాలపై పొలాల రోజున సాంబశివుడి వద్ద గోడు వెల్లబోసు కుంటాయని రైతుల నమ్మకం. అందుకే వాటిని ఆలయాలకు తీసుకెళ్తారు. పశువుల మొర వినడానికి సాంబశివుడు హన్మాన్ గుడికి వస్తాడని రైతుల విశ్వా సం.వ్యవసాయేతర కుటుంబాల వారు మట్టితో చేసిన ఎడ్ల ప్రతిమలను ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజలు చేశారు.