నేడు ఢిల్లీకి వెళ్లనున్న టీపీసీసీ నూతన అధ్యక్షుడు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తనపై నమ్మకంతో పీసీసీ అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధిష్టానాన్ని ఆయన స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలపనున్నట్టు సమాచారం. మరోవైపు సెప్టెంబర్ 15న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన తరువాత రోజే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు ఆయన పీసీసీ హోదాలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీ నుంచి దిగిపోయాక, పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మహేష్ గౌడ్ లు తొలిసారిగా ఢిల్లీకి ఈనెల 16న వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో మంత్రి వర్గ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు పై అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం.

Spread the love