నవతెలంగాణ – నెల్లికుదురు
ఈనెల 19వ తేదీన జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే నూతన ఉపాధ్యాయుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు యాకయ్య కోరినట్లు తెలిపారు. డీఎస్సీ 2024 ఉపాద్య అవగాహన సదస్సు కు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం ఎమ్మార్సీ కార్యాలయంలో నీ విశ్రాంతి సమయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు, విద్యా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వృత్తిలోకి అడుగుపెట్టిన నూతన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పైన అవగాహన కలిగి ఉండవలసిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అందుకే ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారము నిర్వహిస్తోన్న ఈ సదస్సులో ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర సమకాలీన కర్తవ్యాలు అనే అంశంపై టిపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి ప్రసంగించనున్నారు. తదుపరి వృత్తినిబద్దత పాఠశాలల పరిరక్షణ అనే అంశంపై టి పి టి ఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసు ప్రసంగించనున్నారు.కావునఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీరామ్ ప్రవీణ్ కుమార్, సంపత్ రెడ్డి, మధుసూదన్, కరుణాకర్,ప్రవీణ్,శ్రీనివాస్, ఉమా రాణి, ఉషా రాణి, తదితరులు పాల్గొన్నారు.