నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్
ఆ నూతన దంపతులకు తొలిరాత్రే చివరి రాత్రి అయ్యింది. పెళ్లయ్యాక శోభనం గదిలోకి వెళ్లిన వారు తెల్లారేసరికి విగత జీవులుగా మారిపోయారు. వధూవరులిరూ గుండెపోటుతో ఒకేసారి కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతాప్ యాదవ్‌కు(20) పుష్ఫ(20)తో మే 30న పెళ్లి జరిగింది. వివాహం అనంతరం వారు శోభనం గదిలోకి వెళ్లారు. కానీ, తెల్లారేసరికల్లా వారు విగతజీవులుగా మారారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, దంపతులకు గుండెపోటు రావడంతో మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వధూవరులు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో వారి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉదంతం నెటిజన్లతోనూ కంటతడి పెట్టిస్తోంది.