ఖోజా కమ్యూనిటీ నాయకులతో సమావేశమై వారి మద్దతు కోరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి

నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని ఖోజా కాలోనిలో ఖోజా కమ్యూనిటీ నాయకులతో ఆదివారం సమావేశమై వారి మద్దతు కోరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ వారు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఆయన తరపున పట్టణంలో ప్రచారం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..ఖోజా లేదా ఖువాజా ప్రధానంగా నిజారీ ఇస్మాయిలీ షియా సమాజం, భారతదేశంలోనిగుజరాత్‌లో ఉద్భవించింది ఖోజా అనే పదం పర్షియన్ పదం ఖ్వాజా నుండి ఉద్భవించింది, ఇది గౌరవ పదం, ఖోజా అనే పదం బనియా  వ్యాపారస్తులుగా ఖ్వాజే అని కూడా పిలుస్తారు. మీలో అందరూ వ్యాపారస్తులుగా స్థిరపడి సమాజంలో సేవలో ముందు వరుసలో ఉంటారు మీరందరూ నాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నేను గెలిచిన తర్వాత మిమ్మల్ని కలుపుకొని పట్టణాభివృద్ధిలో సమాజ సేవలో ముందు వరుసలో ఉంటానని అన్నారు నాకు మద్దతు తెలిపిన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
Spread the love