– ఎమ్మెల్యేపై ఆధారపడిన కాంగ్రెస్ అభ్యర్థి…
– పట్టు నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ పాట్లు…
– బోని కోసం బీజేపీ తహతహ…
ప్రజా సమస్యల కోసం సీపీఐ(ఎం) పోటీ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సార్వత్రిక ఎన్నికల సమరానికి ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా, 18 నుంచి 25 వరకు నామినేషన్ స్వీకరణలో మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 26న 10 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 12 పోటీ నుంచి తప్పుకోగా, 39 మంది పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా దేశ దిశా, దిశను మార్చే ఎన్నికలు పల్లెల్లో ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల సందడి కనిపించకపోవడం గమనార్హం. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడ చూసినా బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజవర్గ స్థాయి కేంద్రం వరకు సందడే సందడిగా ఉండేది. ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఆరు జిల్లాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వర్గాలుగా విస్తరించి ఉంది. ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో సుమారు 18 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
పల్లెల్లో కనిపించని పార్లమెంటు ఎన్నికల సందడి…
భారతదేశ దశ, దిశను మార్చే పార్లమెంట్ ఎన్నికలు పల్లె నుంచి పట్నం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించాలి. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. దీంతో పల్లెల్లో పార్లమెంటు ఎన్నికల సందడి కనిపించకపోవడంతో ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. కాగా గత (2023) అసెంబ్లీ ఎన్నికలలో ఓటుకు 2000 నుంచి 5000 వరకు పంపిణీ జరుగగా, ప్రస్తుతం తమ ని పలకరించే వారి లేరని ప్రజలు వాపోతున్నారు.
ఎమ్మెల్యేలను నమ్ముకున్న కాంగ్రెస్…
భువనగిరి పార్లమెంటు పరిధిలో భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడు , నకిరేకల్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా, ఒక జనగాం నియోజవర్గంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. కాగా నియోజవర్గ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు అధికారంలో ఉండడంతో తమ గెలుపు సునాయాసం అని, మెజార్టీపై దీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, గెలుపు అంత ఈజీ కాదు అని ప్రజలు, ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
పట్టు నిలుపుకోవడం కోసం బిఆర్ఎస్ ప్రయత్నం….
2014 ఎన్నికలలో భువనగిరి పార్లమెంట్ సీటును కైవసం చేసుకున్న విధంగానే ఈసారి కూడా కైవసం చేసుకోవాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ సర్పంచ్, ఎంపీపీ , కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లడం ఆ పార్టీలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ చెక్కుచెదరని క్యాడర్ ఉండడంతో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బోనీ కోసం బిజెపి తహతహ…
దేశంలో నరేంద్ర మోడీ చరిష్మాతో ఈసారి భువనగిరిలో ఎలాగైనా గెలవాలని బిజెపి తహతహలాడుతుంది. గతంలో 2014లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్, ప్రస్తుతం బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తూ, గెలుపు కోసం సామాజిక వర్గాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. కాగా బిజెపిలో మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన బూరకు టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీలో అంతర్గత పోరు ఎటువైపు పని చేస్తుందో తెలువని అయోమయ పరిస్థితి బిజెపి క్యాడర్లో నెలకొంది.
ప్రజా సమస్యల ఎజెండాగా సిపిఎం పోటీ….
ప్రజలకు ఏ ఒక్క చిన్న సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్కరు కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేయాలని అంటారు. పెట్రోల్ రేటు పెరిగిన పెట్రోల్ , డీజిల్ రేట్లు , పెరిగిన నిత్యవసర వస్తువుల రేట్లు పెరిగిన, కమ్యూనిస్టులు పోరాటం చేయాలని ధర్నాలు రాస్తారోకోలు చేయాలని చర్చించుకుంటారు. వారి కళలను నిజం చేయడం కోసం ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో భువనగిరిలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. మూసి ప్రక్షాళన స్థానిక సమస్యల ఎజెండాగా పోరాటం నిర్వహించి, బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుల పక్షాన పోరాటం చేసి, వారి సమస్యల కోసం పోరాటం చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా రథసారథి, (సిపిఎం కార్యదర్శి) ఎండి జహంగీర్ ఈ ఎన్నికలలో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సిపిఎం పార్టీ అభ్యర్థి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు మే 13 న తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.