నామినేషన్ దాఖలు చేసిన వేముల  ప్రశాంత్ రెడ్డి

–  భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
నవతెలంగాణ- భీంగల్:
బాల్కొండ నియోజకవర్గ  స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వేల్పూర్ లోని తన స్వగ్రామం లోని పెద్దమ్మ గుడి లో తన సతీమణి వేముల నీరజ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు  నిర్వహించి. వేల్పూర్ నుండి బస్సు లో భీంగల్ చేరుకున్న మంత్రి వేముల నామినేషన్ దాఖలు చేశారు. తన సతీమణి వేముల నీరజ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేతిరెడ్డి సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, హెల్త్ అండ్ వెల్ఫేర్ చైర్మన్ మధుశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ లతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిత్ర మీశ్రా కు అందజేశారు. అనంతరం వేముల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, మూడో సారి తన విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Spread the love