– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ- పెద్దవంగర: నేడు తొర్రూరు డివిజన్ పరిధిలోని హరిపిరాల గ్రామంలో జరిగే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు మండలం నుండి రైతులు, నాయకులు భారీ ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, మండల ప్రచార కార్యదర్శి లింగాల రమేష్, సర్పంచ్ గుగులోతు పటేల్ నాయక్, మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, అంగోత్ సీత నాయక్, నాయకులు భూక్యా పాండు, ధరావత్ దేవేందర్, జాటోత్ పుల్ సింగ్, కూకట్ల యాకన్న, దంతాలపల్లి సోమేశ్వర్, దయాకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.