– లేత పామాయిల్ గెలలు అశ్వారావుపేట పామాయిల్ మిల్ లో స్పెషల్ క్రస్సింగ్ కు చర్యలు…
– ఉమ్మడి ఖమ్మం జిల్లా పామాయిల్ రైతులు ఆందోళన చెంద వద్దు….
– ఇతర జిల్లాల ఆయిల్ పామాయిల్ గెలల రవాణా ఖర్చులు ప్రయివేటు కంపెనీలే భరిస్తాయి…
– ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి, గద్వాల్,నాగర్ కర్నూలు ప్రాంతాల్లో ప్రయివేటు కంపెనీలు ఆద్వర్యంలో సాగులో ఉన్న ఆయిల్ ఫాం సాగు లో ఉన్న గెలలు ను,రైతులను నుండి సేకరించిన కొత్తగా దిగుబడి అయ్యే ఆయిల్ ఫాం గెలల రవాణా ఖర్చులు సంబంధిత ప్రయివేటు కంపెనీలే భరిస్తాయని అందువల్ల రైతులు ఎవరూ అధైర్యపడవద్దు అని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో పామాయిల్ సాగు రైతులకు ఎటువంటి నష్టం రానివ్వం అని ఆయన అన్నారు. పలు పత్రికలలో నూనె దిగుబడి,రవాణా చార్జీలు పలు విషయాల పై వచ్చిన కథనాల పై హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో ఇప్పటికే దశాబ్దాలుగా అనుభవం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు అవగాహన ఉందని అన్నారు. ఇమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని నాగర్ కర్నూలు, గద్వాల్,వనపర్తి ప్రాంతాల్లో నూతనంగా ఆయిల్ పామ్ గెలలు వస్తున్నాయని వీటిని అశ్వారావుపేట పేట లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్ కు తరలించి స్పెషల్ క్రస్సింగ్ చేస్తున్నాం అని ఇందు వల్ల ఆయిల్ రికవరీ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఎటువంటి నష్టం రాదని ఛైర్మన్ రాఘవ రెడ్డి తెలిపారు. రవాణా కు అయ్యే భారం కూడా రైతు పై పడకుండా సంబంధిత ప్రయివేటు కంపెనీలే భరించే లా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాలోని ఆయిల్ పామ్ గెలల ను ప్రాసెసింగ్ చేయడానికి ప్రస్తుతం రాష్ట్రంలో అశ్వారావుపేట ,అప్పారావు పేట మిల్ లే అందుబాటులో ఉన్నాయని అందుకే అశ్వారావుపేట కు తరలిస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ విషయం లో రైతులు ఎటువంటి అనుమానాలు..అపోహలకు పోవద్దని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అపార అనుభవం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లాకే చెందిన వారు కావడం కూడా గుర్తించాలన్నారు. రైతు ను రాజు చేసేందుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఇంకో రైతు ను నష్టం చేయడానికి కాదని ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు. పత్రికలలో వస్తున్నట్లు ఏదో ప్రయివేటు కంపెనీల కు లాభం చేకూర్చే ఉద్దేశ్యం మా ప్రభుత్వం కు లేదన్నారు.. స్వయంగా రైతు బిడ్డ నైన తాను,తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితి లో ఆయిల్ పామ్ రైతాంగానికి నష్టం రానివ్వదని భరోసా ఇచ్చారు.