నవతెలంగాణ – హైదరాబాద్: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. దోమలగూడ గగన్‌మహల్‌లోని రాధామాదవ్ నివాస్ మొదటి అంతస్తులో మహేశ్ తన భార్య స్నేహలత, కుమారుడు పవన్‌తో కలిసి ఉంటున్నాడు. స్నేహలత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా బిహార్‌కు చెందిన మహేశ్‌ను పనిమనిషిగా పెట్టుకున్నారు. బుధవారం స్నేహలత కుటుంబ సభ్యులు మార్కెట్‌కు వెళ్లగా.. ఒంటిరిగా ఉన్న స్నేహలతను మహేశ్ మరో వ్యక్తితో కలిసి కుర్చీలో బంధించాడు. కొట్టి, అరుపులు బయటకు వినిపించకుండా నోటిలో గుడ్డలుకుక్కారు. అనంతరం బీరువాలో ఉన్న నగదు, బంగారాన్ని తీసుకొని పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. స్నేహలత కుర్చీలో బంధించి, అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను వెంటనే హైదర్‌గూడలోని అపోలో దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మహేశ్ కనిపించకపోవడంతో అతడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని గాంధీనగర్ ఏసీపీ రవికుమార్, దోమలగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితోపాటు క్లూస్‌టీం సందర్శించాయి. కేమహేశ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.