లాస్‌ ఏంజిలిస్‌ చేరుకున్న ఒలింపిక్‌ పతాకం

The Olympic flag reached Los Angeles– హాలీవుడ్‌ నగరంలో ఎగరనున్న ఒలింపిక్‌ జెండా
లాస్‌ ఏంజిల్స్‌ (యుఎస్‌ఏ): ఒలింపిక్‌ పతాకం (జెండా) 2028 విశ్వ క్రీడల ఆతిథ్య నగరం లాస్‌ ఏంజిల్స్‌కు చేరుకుంది. ప్రత్యేక విమానంలో పారిస్‌ నుంచి బయల్దేరిన లాస్‌ ఏంజిలిస్‌ మేయర్‌, క్రీడా బృందం సోమవారం యుఎస్‌ఏలో కాలుమోపారు. ‘ఎల్‌ఏ 28’ అక్షరాలతో లిఖించిన ప్రత్యేక విమానంలో అమెరికా అథ్లెట్లు, అధికారుల బృందం ఒలింపిక్‌ జెండాతో లాస్‌ ఏంజిలిస్‌కు చేరుకున్నారు. హిప్‌ హాప్‌ లెజెండ్‌ షకూర్‌ ‘కాలిఫోర్నియా లవ్‌’ బాణీలను వినిపిస్తుండగా ఒలింపిక్‌ జెండా లాస్‌ ఏంజిలిస్‌లో అడుగుపెట్టింది. 2028 ఒలింపిక్స్‌ సందర్భంగా ఈ ఒలింపిక్‌ జెండాను లాస్‌ ఏంజిల్స్‌ నగరంలో ఎగురవేయనున్నారు.
అతిపెద్ద బాధ్యత: ‘ఒలింపిక్‌ ఆతిథ్యానికి పారిస్‌ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఒలింపిక్‌ జెండాను అందుకుని ఇక్కడికి రావటం గొప్ప గౌరవం, అతిపెద్ద బాధ్యతగా అనిపించింది. లాస్‌ ఏంజిలిస్‌నగరం ఒలింపిక్స్‌ను గొప్పగా నిర్వహించేందుకు పని చేస్తుండగా.. అమెరికన్‌ ఆర్గనైజర్స్‌ కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్‌ను పారిస్‌ గొప్పగా నిర్వహించింది. లాస్‌ ఏంజిలిస్‌ నివాసం లేనివారి సమస్యను ఎదుర్కొవాల్సి ఉంది. కానీ లాస్‌ ఏంజిలిస్‌కు ప్రపంచంలో ఎవరికీ లేని ఆస్తి ఉంది. హాలీవుడ్‌ సహకారంతో ఒలింపిక్స్‌లో మ్యాజిక్‌ సృష్టికి అవకాశాలు పుష్కలం’ అని లాస్‌ ఏంజిల్స్‌ మేయర్‌ కేరెన్‌ బాస్‌ తెలిపారు.
ఆధునిక ఒలింపిక్స్‌లో లాస్‌ ఏంజిలిస్‌ఏకంగా మూడోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 2017లో ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న లాస్‌ ఏంజిలిస్‌.. గతంలో 1932, 1984 సమ్మర్‌ ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచింది.

Spread the love