ఒలింపిక్స్‌పై ప్రభావం ఉండదు!

ఒలింపిక్స్‌పై ప్రభావం ఉండదు!– ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితిపై ఐఓసీ
పారిస్‌ (ఫ్రాన్స్‌) : ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి పారిస్‌ 2024 ఒలింపిక్‌ క్రీడలపై ఏమాత్రం ఉండబోదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ తెలిపారు. ‘ఫ్రాన్స్‌లో తరచుగా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు మరోసారి జరుగబోతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చినా అందరూ ఒలింపిక్స్‌కు మద్దతుగా నిలుస్తారు’ అని బాచ్‌ అన్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఆతిథ్య నగరంగా పోటీపడుతున్న నాటి నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఒలింపిక్స్‌ నిర్వహణలో ప్రభుత్వంతో కలిసి ఎలా పని చేయాలో మాకు అర్థమైందని 2024 క్రీడల చీఫ్‌ టోనీ అన్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌ జులై 26న ఆరంభం కానుండగా.. ఫ్రాన్స్‌ దిగువ సభకు జూన్‌ 30, జులై 7న రెండు రౌండ్లలో పోలింగ్‌ జరుగనుంది.

Spread the love