కొనసాగుతున్న అంగన్‌వాడీ, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె

– ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
– తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వినతి
– సమ్మెను మరింత ఉధృతం చేస్తాం
నవతెలంగాణ-యాచారం
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె యాచారం మండల కేంద్రంలో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా అంగన్వాడీలు, ఆయాల సమ్మె ఆదివారం 21వ రోజుకు చేరుతుంది. అనంతరం ఆశా వర్కర్ల సమ్మె ఏడవ రోజు, మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె 4వ రోజు నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె సీఐటీయూ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అంగన్‌వాడీలు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్లు తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీరంతా సమ్మెలో కూర్చొని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించకుంటే మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ ఆయాల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బొడ్డు రాజలక్ష్మి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ చందు నాయక్‌, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

Spread the love