– పదో రోజూ వీడని ఉత్కంఠ
– ముంబయికి బీజేపీ పరిశీలకులు
– నేడు మహాయుతి భేటీ?
– రేపు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
న్యూఢిల్లీ/ముంబయి: మరాఠా పీఠంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన సోమవారం పదో రోజుకు చేరింది. బుధవారం జరిగే పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజరు రూపానీని బీజేపీ అధిష్టానం ముంబయి పంపుతోంది. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే తన షెడ్యూల్ సమావేశాలను రద్దు చేసుకు న్నారు. మరో కీలక నేత, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ హస్తిన బాట పట్టారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన బీజేపీ నాయకత్వంతో చర్చలు జరుపుతారు. బీజేపీ అధి ష్టానంతో జరిగే చర్చల సందర్భంగా మంత్రుల శాఖల కేటాయింపు అంశాన్ని అజిత్ పవార్ లేవనెత్తే అవకాశం ఉంది. కాగా మహాయుతి నేతల మధ్య సోమవారం సమావేశమేదీ జరగబోదని శివసేన వర్గాలు తెలిపాయి. మహాయుతి భాగస్వామ్య పక్షాల మధ్య బీజేపీ ఏర్పాటు చేయబోయే సమావేశం కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆ వర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శిండేకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి పది రోజలు గడిచినప్పటికీ ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు. ముఖ్యమంత్రి పదవికి ఫడ్న వీస్ పేరు ఖరారైందని బీజేపీ సీనియర్ నేత ఒకరు పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో ఫడ్నవీస్‌ను నేతగా ఎన్ను కుం టారని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ముఖ్య మంత్రి పదవిపై బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడు తుంటే ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ఈ నెల ఐదవ తేదీన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులే ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ఏక్‌నాథ్ శిండే గొంతు ఇన్‌ఫెక్షన్, జ్వరంతో బాధపడుతుండడంతో సోమవారం జరగాల్సిన మహాయుతి నేతల భేటీ వాయిదా పడింది. షిండే తన అధికార నివాసం ‘వర్ష’కు చేరుకోలేదు. ఆయన ఇంకా సతారాలోని తన స్వగ్రామంలోనే ఉన్నారు. మహాయుతి నేతలు మంగళవారం సమావేశమై మంత్రుల శాఖల కేటా యింపుపై ఓ నిర్ణయానికి వస్తారని సమా చారం. ఇదిలావుండగా తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను శిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే తోసిపుచ్చారు. ఈ వార్తలు నిరాధా రమని అంటూ మంత్రి పదవికి తాను పోటీలో లేనని స్పష్టం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఏక్‌నాథ్ షిండే విశ్రాంతి కోసం స్వగ్రామానికి వెళ్లడంతో వదం తులు వ్యాపిస్తు న్నాయని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత తనకు కేంద్రంలో క్యాబినెట్ మంత్రి అయ్యే అవకాశం వచ్చిందని, అయితే పదవిని చేపట్టాలన్న కోరిక తనకు లేదని అన్నారు.