ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం 

Wood purchasing center launched under the auspices of IKPనవతెలంగాణ – తంగళ్ళపల్లి
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులను నమ్మి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రం తో పాటు మండలంలోని మండేపల్లి, కాస్బే కట్కూరు, గండి లచ్చపేట గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలలోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. వడ్లు తూకం వేసిన వారం రోజుల్లోగా డబ్బులు రైతుల ఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు హారిక రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, పరశురాములు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సత్తు,శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క శేఖర్,మాజీ ఉప సర్పంచ్  తిరుపతి, ఎగుర్ల ప్రశాంత్, మచ్చ శ్రీనివాస్, సామల గణేష్ పాల్గొన్నారు

Spread the love