– ముఖ్యమంత్రిని కలిసి సిరిసిల్ల నేతన్నల సమస్యను పరిష్కరించాలని కోరుతా…
– నేతన్నల మహా ధర్నా లో శాసనమండలి మాజీ సభ్యులు చెరిపెల్లి సీతారాములు
నవతెలంగాణ – సిరిసిల్ల
గత ప్రభుత్వ నిర్వాకం నేటి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలోనే మరో సోలాపూర్ గా పేరొందిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యను పరిష్కరించాలని కోరుతామని శాసనమండలి మాజీ సభ్యులు చెరిపెల్లి సీతారాములు అన్నారు రాష్ట్రంలోని సిరిసిల్లలో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన నేతన్నల మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గత ప్రభుత్వంలో జోలి శాఖ మంత్రిగా పనిచేసే నేత కార్మికుల సమస్యలను ఏం పరిష్కరించాలని ఆయన ప్రశ్నించారు ఎంపీగా పనిచేస్తున్న బండి సంజయ్ దేవుడి పేరిట రాజకీయాలు చేయవద్దని ఏ ఒక్కరోజు నేత కార్మికుల సమస్యలపై నీవు మాట్లాడలేదని ఇది నీ వివక్షతకే వదిలేశామని నేత కార్మికులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు దేశంలో బిజెపి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని దేవుడు అంటే మా అందరికీ భక్తి ఉంటుందని బిజెపి ప్రభుత్వం దేవుడి పేరిట మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుందని ఈసారి దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఓటు ద్వారా గద్దె దించుతారని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చినట్లు ప్రచారం చేసుకునే తప్ప ఆఖరుకు బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేక పోయిందని ఆయన అన్నారు సిరిసిల్ల శాసనసభ్యునిగా కేటీఆర్ ను గెలిపించి శాసనసభకు సిరిసిల్ల నేతన్నలు పంపిస్తే ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో నేత కార్మికుల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నేతన్నల పట్ల ఆయనకు ఉన్న వివక్షత కనిపిస్తుందని పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు ఇవ్వకపోవడమే కాకుండా కార్మికులకు వచ్చే నూలు రాయితీ 18 కోట్లు కూడా మంజూరు చేయలేదని ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఆర్డర్ ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిందని 70% కు పైగా మరమగ్గాలు ఆగిపోయాయని నేత కార్మికులు రోడ్డున పడ్డారని శాసనమండలి మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు ఈ మహా ధర్నాలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు