– కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ ఆర్మూర్: నియోజకవర్గ ప్రజలు, నాయకులు, అభిమానులు,పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ నాకు ఓటు వేసిన అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బిజెపి పార్టీ పైడి రాకెశ్ రెడ్డికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నైతికంగా మనమే గెలిచినామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధైర్య పడవద్దు అని, నియోజకవర్గ ప్రజలకు దగ్గరుండి పనిచేయాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గంలోని ప్రతి అభివృద్ధి పనులకు నా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఆర్మూర్ నియోజవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా మీకు ముందుండి నడిపిస్తానని, అభిమానులు ప్రజలు అధైర్యపడవద్దని నేను మీకు మాటిస్తున్నానని పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎల్లవేళలా నన్ను సంప్రదించవచ్చు అని అన్నారు.