– ఆచూకీ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు
నవతెలంగాణ – దహేగాం
గత మూడు రోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాగులో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలోని ఇట్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొట్రాంగి సంతోష్(35) బహిర్భుమి కోసం గ్రామ సమీపంలోని బొక్కివాగుకు వెళ్లాడన్నరు.దీంతో ప్రమాద వశాత్తు వాగులో పడిపోయి గల్లంతైనట్లు పేర్కొన్నారు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతుకుతున్నారు.అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.