నవతెలంగాణ – మద్నూర్
శుక్రవారం జరిగిన యాక్సిడెంట్ లో గాయపడ్డ సుధీర్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు నాందేడ్ జిల్లా కేంద్రంలో శనివారం మూడు గంటలకు నిర్వహించినట్లు బంధువులు గ్రామస్తుల ద్వారా తెలిసింది. శుక్రవారం సాయంత్రం స్కూటీపై వెళ్తున్న సుధీర్ కు ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన నాందేడ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిసింది. యాక్సిడెంట్ జరిగిన సంఘటన స్థలాన్ని శుక్రవారం ఎస్ఐ విజయ్ కొండ సందర్శించి గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తులసిరామ్ దేగ్లూర్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.