దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

The person involved in the theft was arrestedనవతెలంగాణ – ధర్మసాగర్
ఈ మద్య కాలంలో జల్సాలు,క్రికెట్ బెట్టింగులకి అలువాటుపడి,అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో బ్యాటరీ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి,రిమాండ్ కు పంపినట్లు స్థానిక సీఐ మహేందర్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం,రంగనాయకపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి నాగేశ్వరరావు  ప్రస్తుతం సికాంద్రబాద్ లో తన తల్లి తండ్రులతో నివాసం ఉంటూ గత కొద్ది రోజులుగా ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ లోని లాంగ్ డ్రైవ్ కార్స్ లో కారుని కిరాయికి తీసుకొని ధర్మసాగర్, చిలుపూర్, రఘునాథ్ పల్లి, జనగామ, బచ్చన్నపేట, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఆగి ఉన్న ట్రాక్టర్, టిప్పర్, లారీ లకి సంబంధించిన 25 బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు.ఈ నెల గత కొద్ది రోజులుగా, ధర్మసాగర్, చిలుపూర్, రఘునాథ్ పల్లి, జనగామ, బచ్చన్నపేట, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లలో వీటికి సంబంధించిన కేసులు నమోదు అయినవని ఆరోపించారు. సోమవారం పోలీస్ సిబ్బందితో  రాంపూర్ హై వే రోడ్డు, వి.ఏం.ఆర్ కాలేజీ అంబేద్కర్ సెంటర్ వద్ద వాహన తనకీలు చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి రెడ్ కలర్ హుందాయి ఐ-20  కారులో అతి వేగంగా వస్తు పోలీస్ వారిని చూసి,వాహనాన్ని ఆపకుండా వెళుతుండగా,అట్టివాహనాన్ని అపి తనకి చేయగా అందులో 12 బ్యాటరీలు ఉండడంతో,అట్టి వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని విచారించగా పూర్తి వివరాలు బయటపడ్డాయని తెలిపారు. ట్రాక్టర్, టిప్పర్, లారీ లకి సంబంధించిన 25 బ్యాటరీలు దొంగతనాలు చేసి,రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ధనలక్ష్మి రైస్ మిల్ వెనుకల గల చెట్ల పొదలలో దాచి ఉన్నాయని తెలిపారు.ఇట్టి బ్యాటరీల విలువ అందజా 1,50,000 రూపాయలు ఉంటుందన్నారు. అందులో నుండి 12 బ్యాటరీలను హైదరాబాద్ లో అమ్ముటకై  రెడ్ కలర్ హుందాయి ఐ-20 కారులో తరలిస్తుండగా నిందితున్ని అదుపులోకి తీసుకొని జుడీష్యల్ కస్టడీకి రిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు.ఇట్టి కేసును చేదించిన ధర్మసాగర్ సీఐ మహేందర్, ఎస్సైలు రాజు, నరసింహారావు,ఏఎస్ఐ పోచయ్య,క్రైమ్ సిబ్బంది సంపత్, కరుణాకర్ లను  కాజీపేట ఏసిపి డేవిడ్ రాజ్ అభినందించారు.
Spread the love