రూ.1000 కోసం వ్యక్తి హత్య..

A person was killed for Rs.1000.– ఆ హత్య బయటకు రాకుండా ఉండేందుకు మరోకరి హత్య
– వారం రోజుల్లో మర్డర్ కేసులను కొలిక్కి తెచ్చిన సౌత్ రూరల్ పోలీసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు హత్య కేసులో చేదించినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక హత్య కేసు పరిశోధన చేస్తుండగా, మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. నలుగురు దోస్తులలో ఇద్దరిని మరో ఇద్దరు మట్టుబెట్టారు. కేవలం రూ.1000 కోసం ఈ హత్యలు జరిగాయని నిజామాబాద్ ఎసిపి శుక్రవారం తన చాంబర్ లో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఎసిపి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మహ్మదీయ కాలనీకి చెందిన ప్లంబర్ పని చేసే అమర్ ఖాన్ అలియాస్ అమ్ము, మహ్మదీయ కాలనీకి చెందిన వెల్డర్ గా పనిచేసే రియాజ్ ఖాన్, ఆటో నగర్ కు చెందిన కూలి పని చేసే మహమ్మద్ బహదూర్, బాబా సాహెబ్ పహడ్ కు చెందిన కూలి పని చేసే సయ్యద్ యూసుఫ్ లలు నలుగురు స్నేహితులు. వేరు వేరు పనులు చేస్తునే నలుగురు స్మశాన వాటిక వద్ద శవాలను కాల్చిన బూడిద సేకరించి అందులో బంగారం, వెండిని వెతికే పనిచేస్తుండేవారు. ఈ నెల 18న అమర్ ఖాన్, రియాజ్ ఖాన్, మహమ్మద్ బహదూర్ (40) లతోకలిసి బైక్ పై బాబాన్ సాహెబ్ పహాడ్ నుంచి ఆర్మూర్ రోడ్డులో గల విజయ్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిజాం సాగర్ కెనాల్ ను అనుకుని ఉన్న స్మశాన వాటికలో బూడిదను సేకరించి మడుగులో కడిగిన వారికి బంగారం, వెండి అనవాళ్లు దొరకలేదు. అక్కడ నుంచి బయలు దేరి మార్గమధ్యలో మద్యం సేవించి గూపన్ పల్లి స్మశాన వాటిక వద్ద బూడిదను సేకరించి పూలాంగ్ వాగులో కడిగిన అక్కడ వారికి ఎలాంటి దొరకలేదు. కాని తనకు రూ.1000 ఖర్చు అయిందని అమర్ ఖాన్, బహదూర్ తో గొడవ పడ్డారు. తర్వాత అమర్ ఖాన్, రియాజ్ ఖాన్ లు బహదూర్ ను చంపుదామని నిర్ణయించుకుని ఓక కట్టే తీసుకోని దానితో పూలాంగ్ ఒడ్డున ఉన్న బహదూర్ తలపై మోది హత్య చేసి డెడ్ బాడీ నీటిలో పారేసి వెళ్లిపోయారు. 19న బాబాన్ సహబ్ పహడ్ వద్ద యూసుఫ్ నిన్న మీ వెంట వచ్చిన బహదూర్ ఎక్కడ అని ఇద్దరిని ప్రశ్నించారు. అప్పుడు అమర్ ఖాన్, రియాజ్ ఖాన్ లు తమతో బహదూర్ వెల్లేటప్పుడు చూసిన యూసుప్ ద్వార విషయం బయటకువస్తుంది అతన్ని చంపాలని పథకం వేశారు. స్నానం చేసి వద్దామని యూసుఫ్ ను నమ్మించి బైక్ పై బాబాన్ సాహబ్ పహడ్ ప్రాంతంలోని జాలి తలాబ్ కు తీసుకుని వెళ్లి స్నానం చేస్తున్నట్టు నమ్మించి అతడిని నీట ముంచి చంపేశారు. యూసుఫ్ చనిపోయిన విషయం 6 వ టౌన్ పోలీస్ స్టేషన్ లో నీట మునిగి చనిపోయినట్లు కేసు నమోదు అయింది. అయితే నలుగురు మిత్రులు ఇద్దరిలో ఓక్కరు హత్యకు గురికావడం, మరోకరు నీట మునిగి చనిపోవడం తో నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో కేసును ప్రతిష్టాత్మకంగా సాంకేతిక ఆధారాలతో అమర్ ఖాన్, రియాజ్ ఖాన్ లను అదుపులోకి తీసుకోవడం తో ఈ రెండు హత్య కేసు కొలిక్కి వచ్చాయి. అమర్ ఖాన్, రియాజ్ ఖాన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
Spread the love