నవతెలంగాణ – ఆర్మూర్
జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ ఆదేశాల మేరకు సుప్రసిద్ధ దేవస్థానం నవనాథ సిద్దుల గుట్ట ఆర్మూర్ నందు నిర్మిస్తున్న”” శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం” నిర్మాణం కొరకు….50,000/- రూపాయల విరాళాన్ని జిల్లా కేంద్రానికి చెందిన శ్రీమతి కురుమాచలం నీలిమ (ఫిజియోథెరపిస్ట్ డాక్టర్) శుక్రవారం అందజేసినారు. ఈ సందర్భంగా ధ్యాన ప్రచారకులు న్యాయవాది సాయి కృష్ణారెడ్డి, కూనింటి శేఖర్ రెడ్డి, పడిగెల శ్రీను తదితరులు ధన్యవాదాలు తెలిపారు.