– అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ లక్ష్యం
– సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
దేశం ఉన్నతి కోసం, స్వాతంత్య్రం కోసం, రాజ్యాంగ నిర్మాణం కోసం త్యాగం చేసిన మహనీయుల చిత్రపటాలను, వారి జీవిత చరిత్ర గ్రందాలను ప్రతి ఇంటింటా చేర్చడమే అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 లక్ష్యమని సొసైటీ జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ అన్నారు.ఆదివారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో సొసైటీ కాళేశ్వరం జోనల్ యూత్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ చిత్ర పటాల ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్నీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ దంపతులు హాజరై చిత్రపటాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతోత్సవాలు నిర్వహిస్తూ వారి చరిత్ర గ్రంధాలు, చిత్రపటాలు పంపిణీ చేయడం, పేద విద్యార్థులకు చేయుతనివ్వడమే ముఖ్య ఉద్దేశ్యంగా వివరించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ జోనల్ అధికారప్రతినిది లింగమల్ల సునీల్, భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్ర సారయ్య, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, కాటారం డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమత, కాటారం డివిజన్ యూత్ అధ్యక్షుడు వేల్పుల మహేందర్, సభ్యులు గౌస్, వెంకటేష్, లక్ష్మన్, వినయ్ పాల్గొన్నారు.