నవతెలంగాణ తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే జిల్లాలోనే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం అర్వపల్లి మండలంలోనీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తుంగతుర్తి లోని తహసిల్దార్ కార్యాలయంలో సాదాసీదాగా వెళ్లి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డికి అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. తాను రైతుల శ్రేయస్సు కోసం కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేయించి రెండు పంటలకు సరిపడా నీళ్లు ఇచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, డంపింగ్ యార్డులు, స్మశానవాటికలు తో పాటు హరితహారం కింద మొక్కలు నాటి గ్రామాలను సైతం అభివృద్ధి చేశానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా కెసిఆర్ ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో అట్టి పథకాలు దేశానికి దిక్సూచిలా ఉన్నాయన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. కెసిఆర్ సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయన్నారు. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కోసం 43 కోట్లకు పైగా నిధులు వెచ్చించి శంకుస్థాపన చేశామన్నారు. రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఆసరా పెన్షన్లు తోపాటు దళితులు ఆర్థికంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్ కే దక్కిందన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి తెలంగాణలోనూ ఉన్న ఆడపడుచులకు పార్టీ లకు అతీతంగా లక్ష 16 వేల రూపాయలు అందించి ఆడపడుచులకు ఒక మేనమామగా నిలిచాడని అన్నారు. అనంతరం రామాలయం నుండి ఎస్సీ కాలనీ వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ నాయక్, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి, కూరం మణి, భూరెడ్డి కళావతి, ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు ఎస్కే రజాక్, అరవపల్లి జడ్పిటిసి దావుల వీర ప్రసాద్ తో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.