తుంగతుర్తి గడ్డపై మనోమారు గులాబీ జెండా ఎగరడం ఖాయం

– ఆరు దశాబ్దాలలో జరిగిన అభివృద్ధి 9 ఏళ్లలోనే
– అభివృద్ధి స్థిరీకరణ కోసం గాదరి మళ్ళీ కావాలంటున్న ప్రజలు
నవతెలంగాణ- తిరుమలగిరి:
రాజకీయాలలో 30 ఏళ్లకు ఒకసారి పెను మార్పులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు మేధావులు చెబుతూ ఉంటారు.ఊహించిన విధంగానే 2014లో తుంగతుర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కారణజన్ముడుగా గాదరి కిషోర్ కుమార్ వచ్చి కొత్త ట్రెండు మార్పుగా నిలిచారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో చేసి చూపించారని, తుంగతుర్తి గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగరడం ఖాయమని, బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగింది తొమ్మిదేళ్ల కాలంలో 6500 కోట్ల నిధులతో చేసిన పనులు దాని నిరూపిస్తున్నాయన్నారు. వరుస విజయాలు సాధించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసి ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారన్నారు. ఆధునిక పరిజ్ఞానం, నేటితరం, యువతరంకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ముందుకు సాగుతూ తుంగతుర్తి నియోజకవర్గ రూపు రేఖలు మార్చారన్నారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పాత, కొత్త తరం వాళ్లను కలుపుకుపోతూ, పార్టీలకతీతంగా విమర్శలకు తావు లేకుండా శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను ప్రత్యక్షంగా చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధికి తుంగతుర్తిని చిరునామాగా నిలిపారన్నారు. గోదావరి నీళ్లను ఎస్సారెస్పీ కాలువల ద్వారా అందించి బీడు భూములను సాగులోకి తీసుకువచ్చి రైతుల
మొఖాల్లో ఆనందం నిలిపారన్నారు. నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని దాన్య బండారంగా తయారుచేసి రైతు రాజ్యం తీసుకువచ్చారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు 49700 ఆసరా పెన్షన్లు,12000 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,8745 మందికి కేసీఆర్ కిట్లు, 9 గురుకులాల ఏర్పాటు, 2000 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణం, 44 కోట్లతో తుంగతుర్తి లో వంద పడకల హాస్పిటల్ మంజూరు,133/11 కె.వి రెండు సబ్ స్టేషన్లు,33/11 9 సబ్స్టేషన్ల నిర్మాణం, తిరుమలగిరి మండలంలో 2500 కుటుంబాలకు దళిత బంధు, మిషన్ కాకతీయ పథకం ద్వారా నాలుగో విడతల్లో 478 చెరువులు, కుంటలను 199 కోట్లతో పూడిక అలుగుకట్టల మరమ్మత్తులు, 77 కోట్లతో ఆరు చెక్ డ్యాముల నిర్మాణం, నియోజకవర్గంలో 52 పల్లె దావకానలు,1601 మందికి 68 కోట్లతో సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం, పల్లె పట్టణ ప్రగతి ద్వారా పచ్చని చెట్లు ప్రగతివనాలు, గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం ఇలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమానికి నియోజకవర్గంలో పెద్దపీట వేశారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి స్థిరీకరణ కోసం ప్రజలు మళ్లీ గాదరే కావాలంటున్నారన్నారు. ప్రజల మనిషిని మరోసారి గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Spread the love