
మోపాల్ మండల కేంద్రానికి చెందిన జంగం విజయ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం మోపాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఎస్ఐ యాదగిరి గౌడ్ విచారణ చేపట్టారు. విజయ మృతదేహం మోపాల్ నుండి మంచిప్ప వెళ్లే దారిలో శనివారం రోజున జెసిబి సహాయంతో వెలికి తీశారు. స్థానికుల కథనం ప్రకారం రెండు సంవత్సరాల నుండి భార్యాభర్తలు తగాదాల వల్ల విజయ తన చెల్లి భాగ్యతో కలిసి ఉంటుంది. మృతురాలు విజయకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. గత ఏడు నెలల నుండి కనిపియ్యకపోయినా కూడా తన చెల్లె మిగతా కుటుంబ సభ్యులకు కేవలం రెండు రోజుల కిందనే తెలియపరిచింది. ఈ కేసు ఒక మిస్టరీ లాగా ఉంది. కావున ఏసిపి రాజ వెంకట్ రెడ్డి, సిఐ సురేష్ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నిజానిజాలను బయటకు తీస్తామని వారు తెలిపారు.