పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది

గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, మిషన్‌ భగీరథ చైర్మన్‌ ఎర్రబెల్లి దయాకర్‌ రావు
నవతెలంగాణ-జనగామ
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది అనిగ్రా మీణ మంచినీటి సరఫరా శాఖ, మిషన్‌ భగీరథ చైర్మన్‌ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జనగామ పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయము ప్రాంగణంలో పోలీసు సురక్ష దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిం చారు. పోలీసు శాఖకు అత్యధిక జీతాలు ఇస్తూ కేసుల పరిష్కారం కోసం వాహనాలు వారికి కావ లసిన సౌకర్యాలను దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తుందిఅనంతరం ఎంఎంఆర్‌ గార్డెన్‌ లో లిడిసిపి సీతారాం అధ్యక్షతనలి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాకముందు పోలీసు శాఖ అనేక ఇబ్బందులు ఎదుర్కొనేదని ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత వారికి కావాల్సిన వసతులు అధికంగా కల్పించే రాష్ట్రాలలో మన రాష్ట్రం మొదటి వరుసలో ఉంటుందని వారికి వాహనాలు కార్యాలయ ఉపయోగాలు తదితర సౌకర్యాలు కల్పిస్తూదన్నారుతద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించడానికి వారు ముందుంటారని దేశంలో అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో క్రైమ్‌ శాతం చాలా తక్కువగా ఉంటుందని ఆ కీర్తి కేవలం పోలీసు శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి దక్కుతుందన్నారు, న్యూయార్క్‌ సిటీలో ఉన్న పోలీసింగ్‌ వ్యవస్థ మాదిరిగా మన పోలీస్‌ వ్యవస్థ ఉందని కేసుల పరిష్కారం 24 గంటల్లో చేదించడం జరుగుతుందని అన్నారు ,ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి పటిష్ట కార్యచరణ ద్వారా కేసుల పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు తెలంగాణలో అన్ని శాఖలో కంటే పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని అన్నారు, జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌ శివలింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ సురక్ష దినోత్సవం జరుపుకోవడం జరుగుతుం దని పోలీసు వ్యవస్థ ప్రజలకు శాంతి భద్రత కల్పించడం కోసం కృషి చేస్తుందని నకిలీ విత్తనాలు అరికట్టడంలో చెడు అలవాట్లకు యువతను దూరంగా ఉంచేందుకు నిత్యం భద్రతా చర్యలు తీసుకుంటుందని అన్నారు అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. డిసిపి సీతారాం మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరి రక్షణ కోసం పోలీసు వ్యవస్థ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం కల్పించిన సౌకర్యా లను వినియోగించుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పాటుచేసి ప్రజలకు దగ్గరగా సంబంధాలు కొనసా గించడం జరుగుతుందని అన్నారు. యువత చెడు అలవాట్లకు పోకుండా ఎప్పటికప్పుడు కౌన్సి లింగ్‌ ఇవ్వడం ప్రచారం నిర్వహించడం క్రైమ్‌ రేట్‌ ను నియంత్రించడం జరుగుతుందని పోలీసు జిల్లాలో శాఖ తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పోకల జమున, అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశారు, రోహిత్‌ సింగ్‌, ఏసీపీలు దేవేందర్‌ రెడ్డి, రఘు చందర్‌, శ్రీనివాసరావు, ఆర్డీవో కృష్ణవేణి, ఆర్టీవో శ్రీనివాసరావు, జడ్పిటిసిలు ఎంపీపీలు జిల్లా అధికారులు పోలీసు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తులనే కాదు, వ్యవస్థను రక్షించాలి
నవతెలంగాణ-పాలకుర్తి
వ్యక్తులనే కాదు వ్యవస్థను రక్షించడంలో క్రీడాకారులు ముందుండాలని సీనియర్‌ జర్నలిస్టు సామాజిక కార్యకర్త డేగల జనార్ధన్‌ సూచించారు. మహాత్మ హెల్పింగ్‌ హాండ్స్‌ వ్యవస్థాపకులు గంట రవీందర్‌ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా మండలంలోని వావిలాలలో జరుగుచున్న మార్షల్‌ ఆర్ట్‌ కుంగ్‌ ఫు కరాటే ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహాత్మ హెల్పింగ్‌ హాండ్స్‌ వ్యవస్థాపకులు గంట రవీందర్‌తో పాటు ఆయన పాల్గొన్నారు. క్రీడాకారులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలను తిలకించారు.ఈ సందర్భంగా జనార్ధన్‌ మాట్లాడుతూ కుంగ్‌ ఫూ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, మెమరీ పవర్‌, సాహసం పెరుగుతుందని వివరించారు. చిన్న వయసులోనే మార్షల్‌ ఆర్ట్స్‌ పై ఆసక్తి పెంచుకుంటే మెంటల్‌ స్టెమీనా కూడా పెరుగుతుందన్నారు. ప్రస్థుత సమాజంలో ఆత్మ రక్షణ సాధన చేయడం అనివార్యమని చెప్పారు. ఈ సందర్బంగా ట్రైనింగ్‌ తీసుకున్న విద్యార్థులు మార్షల్‌ ఆర్ట్స్‌ లో పలు విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం కలర్‌ బెల్ట్‌ లు (గ్రేడింగ్‌) సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై తాళ్ళ శ్రీకాంత్‌, సర్పంచ్‌ గంట పద్మ భాస్కర్‌, న్యూ స్టార్‌ కుంగ్‌ ఫూ,మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనర్స్‌ మాస్టర్‌ గుగ్గిళ్ళ దేవేందర్‌, మాస్టర్‌ సలీం పాషా, శీల లింగయ్య, రంజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love