నవతెలంగాణ – హైదరాబాద్: లైంగికదాడి కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును నిలిపివేయడంతో బెయిల్ కూడా రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా అవార్డు రద్దు కావడంతో జానీ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్ కు తరలించే ఛాన్స్ ఉంది.