నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వేషన్ అయినందునే ఇప్పటివరకు నియమించడం లేదని ఎమ్మార్పీఎస్ యాదాద్రిభువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం గడిచిన చౌటుప్పల్ మార్కెట్ కమిటీని ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని స్థానిక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో 75 శాతం మార్కెట్ కమిటీలు అన్నిటిని ప్రకటించిన,కేవలం చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వేషన్ అయినందుకే ప్రకటించడం లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కూడా ఇలాగే కాలయాపన చేసి మా దళిత జాతికి తీరని అన్యాయం చేశారని బోయ లింగస్వామి మాదిగ వాపోయారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేకు దళితులు అంటే గౌరవం ఉంటే మార్కెట్ కమిటీని వెంటనే భర్తీ చేయాలని కోరారు. చౌటుప్పల్ అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి మార్కెట్ కమిటీ కేటాయించాలని కోరారు.జిల్లా మంత్రులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ పక్షాన బోయ లింగస్వామి మాదిగ కో కోరారు.