ఉపాధ్యాయునిపై పొక్సో కేసు నమోదు..

POCSO case registered against teacherనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేసే రమేష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పాఠశాలలో చదువుకునే ఒక విద్యార్థినిపై అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు. అంతేకాక అసభ్యకరమైన చేష్టలు చేస్తూ.. సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు ఫోన్ లో చెప్తానని చెప్పి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ ఫోన్ కి అసభ్యకరంగా వాట్సాప్ మెసేజ్ చేయసాగాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
Spread the love