– హుస్నాబాద్ బస్ డిపోను బలోపేతం చేస్తా..
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా కూడా ప్రజలకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నాను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజలనుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాల పై దరఖాస్తులను స్వీకరించిన రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోనే కాంగ్రెస్ పార్టీ 420 అని బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం తగదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే ఎమ్మెల్యేగా ఎంపికై రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించానని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలను మరవనని ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. మీకు ఏ సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరించే బాధ్యత నాదన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీ లను అమలు చేస్తామని అన్నారు .ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 85 వేల అప్లికేషన్లను స్వీకరించామని తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్దానంలో భాగంగా హైదరాబాదులో ధర్నా చౌక్ ను ప్రారంభించామన్నారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అవసరమైన రిపేర్లు పూర్తి చేసి అందిస్తామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే మున్సిపాలిటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సిడిఎంఏ బృందం నిన్ననే హుస్నాబాద్ కు వచ్చి పరిశీలించిందని, గౌరవెల్లి నిర్వాసితులతో దురుసుగా ప్రవర్తించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రవర్తించి సమస్య పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించామని, ఇంకా 2000 ఎకరాల భూసేకరణ చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మిస్తామన్నారు.దేవాదుల, శ్రీరామ్ సాగర్, వరద కాలువ ఫేస్ 2 ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. మున్సిపల్ పట్నంలోని హమాలీలకు హెల్త్ ప్రొఫైల్ టెస్ట్ చేపించే అవసరమైన వైద్య సేవలు అందిస్తామని పేర్కోన్నారు. నిమ్స్ ఎం.ఎన్.జె తదితర ఆస్పత్రులలో వైద్య సేవల కోసం వస్తే ఒక ప్రత్యేక వ్యక్తిని అందుబాటులో ఉంచి ప్రత్యేకమైన వైద్య సేవలు రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతం వారికి చేయిస్తానని చెప్పారు. విద్యా, వైద్యం, గృహవసతి, ఉద్యోగులు, సామాన్య ప్రజలు, రైతుల తదితరులు అందరి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. హుస్నాబాద్ నుండి ఏ ప్రాంతానికైనా బస్ సౌకర్యం కావాలనిపిస్తే నాకు చెప్పండి. ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్లిన గౌరవం పెరిగేలా మీ ఇమేజ్ ని పెంచుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ బెన్ షాలేం, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , ఏసీపీ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, కౌన్సిలర్ పద్మ, ప్రజాప్రతినిధులు తదితరులు.