– బీఆర్‌ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రధాని మోడీ వరంగల్ సభ ద్వారా తెలంగాణపై మరోసారి తన రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించా రని బీఆర్‌ఎస్ ఎంపీ బి.వెంకటేశ్ నేత విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో వస్తున్న స్పంద నను చూసి తట్టుకోలేకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్ ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ టి.భానుప్రసాద్‌తో కలిసి వెంకటేశ్ నేత మాట్లాడారు. వరంగల్ సభలో ప్రధాని అన్నీ అబద్ధా లు, అసత్యాలే మాట్లాడారని విమర్శిం చారు. పీఎం స్థాయిలో ఇలా మాట్లా డటం సరికాదన్నారు. దేశాన్ని నియం తలా పాలిస్తున్న మోడీని ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు.