– ఇచ్చాకనే ఈ గడ్డపై అడుగు పెట్టాలి : చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ప్రకటించే విషయంలో ప్రధాని మోడీ నోరు విప్పాలని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. హౌదా ఇచ్చిన తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ ఒకటిన ప్రధాని మహబూబ్‌నగర్ జిల్లాలకు రానున్న నేపథ్యంలో బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. పాలమూరుకు చేసిందేమి లేకుండా మోడీ వచ్చి చెప్పేదేముందని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు కోరిన పాలమూరును పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో కర్ణాటకలోని అప్పర్ భద్రకు జాతీయ హౌదా ఇచ్చారని విమర్శించారు. అప్పర్ భద్రకు ఇస్తే తప్పు లేదనీ, పాలమూరుకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. జాతీయ హౌదా ఇవ్వకుంటే పాలమూరు,రంగారెడ్డి ప్రజలు ఎప్పటికీ క్షమించారని హెచ్చరించారు.