– ఇంత జరిగిన స్పందించని విద్యాధికారులు
– పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
– ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో ఆల్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్ లో 5 తరగతి చదువుతున్న విద్యార్థి విశాల్ ను చితకబాదిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంపై అధికారులు ప్రత్యేక విచారణ జరపాలని డిపాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఆల్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి ఇంగ్లీషులో సమాధానం చెప్పలేదని నేపంతో ఇంగ్లీష్ టీచర్ తో పాటు ప్రిన్సిపల్ కర్రలతో విపరీతంగా కొట్టారు. ఈ విషయం విద్యార్థి ఇంటికి వెళ్లి ఆ తర్వాత తల్లికి చెప్పడంతో షర్టు విప్పి చూడటంతో గాయాలు ఉన్నాయి. దీంతో వైద్యులకు చూపించిన పేరెంట్స్ శుక్రవారం ఉదయం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాటు టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాలలో విద్యార్థులను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పాఠశాలలో యాజమాన్యానికి పేరెంట్స్ తో తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇంత జరిగిన పాఠశాల వద్దకు విద్యాధికారులు రాకపోవడం గమనాహర్వం. రెండు గంటలపాటు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తిరిగి వెళ్లిపోయారు.కాగా ఇంత గోరాది గోరంగా విద్యార్థులను హింసిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేరెంట్స్ పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నట్టు తెలిసినప్పటికీ కూడా ఒక అధికారి కూడా అటువైపు రాకపోవడం పై ఆంతర్యం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం అధికారులు కుమ్మక్కై వేలాది రూపాయల ఫీజులు వసూలు చేయడంతో పాటు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో జరుగుతున్న తీరుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.