కవిత సమస్య వేరు… ప్రజల సమస్యలు వేరు

– ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లిక్కర్‌ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమస్య వేరనీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వేరని టీజేఎస్‌ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. గురువారం హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మార్చి 10న నిర్వహించనున్న తెలం గాణ బచావో సదస్సు బ్రోచర్‌ను ఆయన ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ కవిత అయినా, ఆదానీ అయినా సరే విచా రించాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర ప్రజలు నిరు ద్యోగం, ధరల పెరుగు దల తదితర సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏండ్ల క్రితం నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తిని కొనసాగించి, తెలంగాణను కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తెలంగాణ ఉద్యమకారులతో హైదరా బాద్‌ బాగ్‌లింగంపల్లి లోని వీఎస్టీ ఫంక్షన్‌ హాలులో ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ బచావో సదస్సును నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love