నవ తెలంగాణ మల్హర్ రావు.
ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలు,వారి సమస్యలను వెంటనే పరిస్కారం చేయాలని తెలంగాణ నిర్మాణ పార్టీ, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు.మండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లు,ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మంగళవారం తెలంగాణ నిర్మాణ పార్టీ తీన్మార్ మల్లన్న టీం సమ్మెకు మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా మాట్లాడారు అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాటిట్యూటీ గ్రాట్యుటీ చెల్లించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకురూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలన్నారు.2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500 హెల్పర్లకు రూ.750 మినీ వర్కర్లకు రూ.1,250 రాష్ట్ర ప్రభుత్వం ఏరియల్ తో సహా చెల్లించి, 2017 నుండి ఇంక్రిమెంట్ మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున వారితో కలిసి పోరాటానికి తీన్మార్ మల్లన్న టీం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఆర్ని రాజబాబు, చంద్రన్న, ఈర్ల విష్ణు,అంగన్ వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.