అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌, కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం
నవతెలంగాణ-చేవెళ్ల
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌ కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం అన్నారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గంలో అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తొమ్మిది రోజులుగా అంగన్‌వాడీ ఉద్యో గులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నా, ప్రభు త్వానికి చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. ప్రభుత్వం, ఐసీడీఎస్‌ అధికారులు అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కార్గో బస్సును తీసుకొచ్చి ఫుడ్‌ పంపిణీ చేయడం వీరి సమ్మెను విచ్ఛిన్నం చేయడంలో భాగమే అని అన్నారు. మంగళవారం సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మద్దతు ప్రకటిం చారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ… అంగన్‌వాడీ ఉద్యో గుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు మద్దతు తెలిపిన వారిలో చేవెళ్ల నియోకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, చేవెళ్ల సొసైటీ చైర్మన్‌ దేవర వెంకటరెడ్డి, ముడిమ్యాల్‌ సొసైటీ చైర్మన్‌ గోనె ప్రతాపరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటయ్య గౌడ్‌, దామరగిద్ద మాజీ సర్పంచ్‌ మధు సూదన్‌ గుప్తా, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆలంపల్లి వీరేందర్‌ రెడ్డి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్‌ టేకులపల్లి శ్రీనివాస్‌ యాదవ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్స్‌ ఆయాలు పాల్గొన్నారు.

Spread the love