అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

The problems of Anganwadis should be solved immediately– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
– కేంద్రాల తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలకు డిమాండ్‌

– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె
– ఐసీడీఎస్‌ కార్యాలయాల ముట్టడి
నవతెలంగాణ- విలేకరులు
అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ (టీచర్స్‌) అండ్‌ హెల్పర్స్‌ (సీఐటీయూ) యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారం కొనసాగింది.యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగవ్వాడీల సమ్మె శిబిరాన్ని చెరుపల్లి సీతారాములు సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగనవాడీ ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్నా వారికి చట్టబద్ధ సౌకర్యాలు లేవన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్‌ అంగన్వాడీల సమస్యలు పరిష్కారిస్తామని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. అందువల్లే అంగన్‌వాడీలు సమ్మెలోకి వెళ్లారని చెప్పారు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌, ఈఎస్‌ఐ బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. పని భారం తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని కోరారు. సమ్మె చేస్తున్న సందర్భంలో అంగన్‌వాడీల సెంటర్ల తాళాలు పగలగొట్టిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో సమ్మెకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పళ్ళ దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్‌ నాయక్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు నాగమణి, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.ఖమ్మం జిల్లా కల్లూరులో అంగన్‌వాడీల దీక్ష శిబిరాన్ని సీపీఐ(ఎం), ఏఐటీయూసీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి సీడీపీవో కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. అనంతరం సీడీపీవోకు వినతిపత్రం అందజే శారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ పాల్గొన్నారు. దుమ్ముగూ డెం, చర్లలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం అధికారికి వినతిప త్రం అందజేశారు. హైదరాబాద్‌లోని గోల్కొండ క్రాస్‌ రోడ్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వరకు అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి వెంకటేష్‌ మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్‌ల కోసం పోరాడుతుంటే అధికారులు వేధింపులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండల తహసీల్దారు కార్యాలయం వద్ద సమ్మెకు సీపీఐ మేడిపల్లి మండల కార్యదర్శి అర్‌.కిషన్‌ మద్దతు ప్రకటించారు. ఘట్కేసర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మెకు సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు.శెట్టి సురేష్‌, గాదె వెంకన్న, కె నగేష్‌, ఎండీ రహీమ్‌ ఆన్‌లైన్‌ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకులు, ఉద్యోగులకు టిగ్లా రాష్ట్ర అధ్యక్షులు మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love