భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి 

The problems of construction workers should be solved– జిల్లా కలెక్టర్ కు వినతి

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ లోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జమ్మిశెట్టి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు వర్తించే అటువంటి ఇన్సూరెన్స్ ను ఎల్ఐసి కి అప్పజెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు. అనేక పోరాటాలు చేసి నిర్మాణ కార్మికులు కొన్ని హక్కులను సాధించుకుంటే వాటిని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం వల్ల కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే కొన్నివేల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని లో అన్నారు వాటి వెంటనే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బిల్డింగ్ నిర్మాణ కార్మికులందరికీ లక్ష స్కూటర్లను ఇవ్వాలని కోరారు  ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నార్మల్గా మరణించితే ఐదు లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా వివాహ ప్రసూతి అంత్యక్రియల ఇచ్చేటటువంటి సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచాలని కోరారు. నిర్మాణరంగ కార్మికుల పిల్లల చదువుల కొరకు స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఈ నెల 23న హైదరాబాద్లోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంటుందని భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ జిల్లా నాయకులు నల్వాల నరసయ్య, సలాం, సంపల్లి సతీష్, మోహన్ రావు, మురళి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love