– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటి, భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపట్టారు దీక్షలను బందు సాయిలు ప్రారంభించి మాట్లాడుతూ… దేశంలో ఎక్కడలేని విధంగా 23,000 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులై చేశామని గొప్పలు చెప్పారని, ఎన్పీడీసీఎల్ పరిధిలో అన్మాండ్ కార్మికులు కొత్త వ్యవస్థ 2013 సంవత్సరంలో పుట్టుకొచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా ఆర్టిజన్లను జేఎల్‌ఎంలుగా చేయాలని, పిసురేటేడ్ కార్మికులకు జీవో-11 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుడు విధి నిర్వహణలో చనిపోతే 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలోకి ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. ఈపీఎఫ్ టు జిపిఎఫ్ మొత్తం ఉద్యోగులకు అమలు చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో సదయ్య, రాజు, శ్రీనివాస్, సమ్మయ్య, రవీందర్, హరిశంకర్, సతీష్, విజేందర్, కే రమేష్, పి సురేషు,అశోక్, శంకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.