విద్యుత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ఎస్‌ఈ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్‌
తెలంగాణ రాష్ట్ర యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం విద్యుత్‌ ఎస్‌ఇ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఎన్పీడీసీఎల్‌ కార్యదర్శి ఎం.ప్రసాద్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్‌ కార్మికులను కన్వర్షన్‌ చేయాలని, అన్‌ మేన్‌ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ట్రాన్స్కో సీబీద్‌, ఎస్‌ఎంజి కార్మికుల సమస్యల పరిష్కరించాలని, మీటర్‌ రీడింగ్‌ , ప్రైవేట్‌ బిల్‌ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2011 జేఎల్‌ఎంలకు వేతన బకాయిలు ఇవ్వాలని, అందరికీ పెన్షన్‌, అర్హులందరికీ ప్రమోషన్‌, మిగిలిపోయిన కార్మికుల ఆర్టీజన్‌గా గుర్తించుట సబ్‌ స్టేషన్‌లో రిటైర్‌ అయిన ఉద్యోగుల తొలగించి కార్మికులతో నింపాలని అన్నారు. ఈనెల 15వ తేదీన చలో హైదరాబాద్‌ కార్యక్రమంను జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ నిరాహార దీక్షలలో అధ్యక్షులు బి.పుష్పరాణి, కార్యదర్శి కె.నాగేశ్వరరావు, డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శి యన్‌.సీతయ్య, గంట శీను, జిల్లా ట్రెజరర్‌ కృష్ణమూర్తి, మీటర్‌ రీడింగ్‌ కార్మికులు పాల్గొన్నారు.

Spread the love