గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

The problems of Gita workers should be solved– కేజీకెఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు పులి నర్సయ్య గౌడ్ 
– ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ – తాడ్వాయి 
గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కే జి కే ఎస్) ములుగు జిల్లా అధ్యక్షులు పులి నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కాటాపూర్ క్రాస్ స్థూపం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 374 వ జయంతి వేడుకలను గీతా కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించారు. గీత కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు రక్షణ కవచం లా ఉండే సేఫ్టీ మోకు లు అందరికీ అందించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. గీత కార్మికులకు ఇచ్చే వృద్ధాప్య పింఛను కూడా 2 వేల నుండి, 5 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రత్యేక గుర్తింపు కల్పించాలన్నారు. బైకులు అందించాలన్నారు. తాటి,ఈత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం సీనియర్ నాయకులు బెల్లంకొండ రోశయ్య, మాజీ సర్పంచ్ పులి పెద్ద నరసయ్య గౌడ్, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మల సమ్మయ్య గౌడ్, గీత కార్మికులు గండు సదయ్య, రంగు లాలయ్య, బెల్లంకొండ నరేష్, రంగు సత్యనారాయణ, గండు బిక్షపతి, పాలకుర్తి బాబు, పులి రాజు, పులి రవి, మధు, తడక హరీష్ గౌడ్, గడ్డం శ్రీధర్, గణేష్, పి రవి, గడ్డం మొగిలి, మల్లయ్య, వడ్లకొండ వెంకన్న, రాజు, లింగాల వెంకన్న, నర్సయ్య, శంకర్, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love