గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

– అక్టోబర్‌ 5న చలో హైదరాబాద్‌ జయప్రదం చేయాలి
– యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కడారి నర్సమ్మ
నవతెలంగాణ-మెదక్‌
గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 5న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కడారి నర్సమ్మ పేర్కొన్నారు. శనివారం మెదక్‌ జిల్లా కేవల్‌ కిషన్‌ భవన్‌లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కె.నర్సమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు 34 రోజులుగా నిరవధిక సమ్మె చేయడం జరిగిందన్నారు. సమ్మెలో పోరాటాలను అనేక వినూత రీతిలో ఉదతం చేయడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్వయంగా చర్చలకు పిలిచి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, సీఎం సమస్యలు పరిష్కరిస్తారని సమ్మె విరమించాలని చెప్పడం జరిగిందన్నారు. మంత్రి హామీ మేరకు జేఏసీ నాయకత్వంలో సమ్మె విరమించడం జరిగిందన్నారు. కానీ 15 రోజుల తర్వాత కేవలం మూడు డిమాండ్లనే పరిష్కరిస్తామని మిగతా డిమాండ్‌ పరిష్కారం చేయలేనని మంత్రి స్వయంగా 50 వేల మంది సిబ్బందిని మోసం చేశారన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల అనేక సందర్బాంలుగా మెరుగైన వేతనాలను చెల్లిస్తానని దళిత ఇంపార్టుమెంటులో సభలో మాట ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని తరగతుల ఉద్యోగులకు వేతనాలు పెంచి రెండు దఫాలుగా వేతనాలు పెంచినప్పటికీ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఇంతవరకు గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకపోవడం దుర్మార్గమైన చర్య అని వ్యాఖ్యానించారు. యూనియన్‌ ఆధ్వర్యం లో జేఏసీ నాయకత్వంలో మరోసారిదశల వారిగా ఆందోళన పోరాటాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితాన్ని ప్రజలకు తెలపాలని ప్రభుత్వంపై పోరాటానికి అక్టోబర్‌ 5వ తేదీన నిర్వహించే ఛలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలను పరిష్కారం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఆసీఫ్‌, నాయకులు స్వామి, రమేష్‌, రాములు పాల్గొన్నారు.

Spread the love