– సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు , ఉద్యోగుల సమస్యలను పరిష్కరిం చాలని తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ బాల రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.దయాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్‌కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుధారాణి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.