మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయూ జిల్లా కోశాధికారి సుంచు విజేందర్‌
నవతెలంగాణ-జనగామ
మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలను పరిష్కరిం చాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి సుంచు విజేందర్‌ డి మాండ్‌ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సం ఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో మంగళవారం డీఈవోకు విన తిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా విజయేందర్‌ మాట్లా డుతూ 28 నుండి కార్మికుల సమ్మెబాట పట్టనున్నట్లు తెలి పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజ నం పెట్టే నిర్వాహకుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా స మస్యలు పరిష్కరించాలని అనేక ఆందోళన, పోరాటాలు ని ర్వహించినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని మండిపడా రు. ప్రభుత్వం పెంచిన రెండు వేల రూపాయలు సంవత్స రం గడిచినా చెల్లించలేదన్నారు. ఒక వైపు రోజు రోజుకి ని త్యావసర సరుకులు, కూరగాయలు ధరలు ఆకాశాన్ని అం టుతుంటే, ప్రభుత్వం చెల్లించే బిల్లులు సరిపోవడం లేదన్నా రు.పెరిగిన వేతనాలు, పెండింగ్‌ ఏరియర్స్‌ వెంటనే చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలను అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలన్నారు. కొత్త మెనూకు నిధులు వెం టనే కేటాయించాలన్నారు. కోడి గుడ్డును ప్రభుత్వమే సరఫ రా చేయాలన్నారు. పిఎఫ్‌, ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత కల్పిం చాలని డిమాండ్‌ చేశారు. వంట పాత్రలతో పాటు హెల్త్‌ కార్డ్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 27లోపు మా సమస్యలు పరిష్కరం చేయకపోతే 28 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు గంధం వల్ల ఆదిలక్ష్మి, ఎల్లమ్మ, రాణి, లీల, నజియా బేగం తదితరులు పాల్గొన్నారు.

Spread the love